calender_icon.png 28 August, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ వలకు చిక్కి రూ. 9.60 లక్షలు పోగొట్టుకున్న ఉద్యోగి

28-08-2025 10:29:30 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఓవైపు పోలీసులు, బ్యాంకు అధికారులు సైబర్ నేరాల్లో(cybercrime) చిక్కకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ, సైబర్ నేరగాళ్ల దోపిడికి అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్ర స్వామి దేవాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జగన్నాథం సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి 9.60 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. తనకు చెందిన నాలుగు క్రెడిట్ కార్డు నుంచి బుధవారం రాత్రి 9.60 లక్షలు పోగొట్టుకున్నట్లు ఫిర్యాదు చేశాడని కురవి ఎస్ ఐ సతీష్ తెలిపారు. బాధితులు ఇటీవల హౌసింగ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోగా, బ్యాంకు అధికారులే ఓటీపీలు అడిగి ఉంటారని చెప్పడంతో సైబర్ నేయడానికి గురై ఉంటాడని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.