calender_icon.png 5 September, 2025 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్లు కనిపించే దేవుళ్లు...!

05-09-2025 12:36:54 AM

- రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ

- ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అభివృద్ధి

- రూ.186 కోట్లతో మెడికల్ కళాశాల, హాస్టల్ భవనాలు ప్రారంభం

- రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ వార్డు ప్రారంభం

-రూ.273.4 కోట్లతో 500 పడకల నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన

సంగారెడ్డి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి):పురాణ ఇతిహాసాలు వెల్లడించినట్లు వైద్యో నారాయణో హరి అన్న ఆరోక్తి ప్రకా రం డాక్టర్లు కనిపించే దేవుళ్ళని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మ కొనియాడారు.

గురువారం సం గారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రూ. 23.75 కోట్లతో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను, రూ.186 కోట్లతో మెడికల్ కాలే జీ, హాస్టల్ను మంత్రి ప్రారంభించారు. రూ. 273.4 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 500 పడకల సామర్ధ్యం గల నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులతో కళాశాల ఆడిటోరియంలో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిగా ప్రజలు భావిస్తారని, వైద్యుడిని దేవునితో సమానంగా చూస్తారని అ న్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో గతంలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అప్పుల పాలు అ య్యేవారని, అలాంటి పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తున్న ట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందజేయడం కోసం ప్రభుత్వం ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సంగారెడ్డి ప్రభు త్వం వైద్య కళాశాలలో ప్రభుత్వం అదునాతన వసతులతో కూడిన 50 పడకల క్రిటికల్ కేర్ వార్డును ప్రారంభించిందన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని వైద్య విద్యార్థులు మంచి నైపుణ్యం గల వైద్యులుగా రూపొంది ప్ర జలకు సేవలు అందించాలని మంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ యువ డాక్టర్లు అందరు రాజకీయాలకు రావాలని, రాజకీయాలను ప్రక్షాళన చేయాలని, వి ద్యావంతులు రాజకీయాలకు వస్తే దేశం మరింత పురోగతి చెందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరి డా. క్రి స్టినా , జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యే లు చింతా ప్రభాకర్, డా.సంజీవ రెడ్డి, మా ణిక్ రావు , కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రకా ష్ రావు, వైద్య కళాశాల అధికారులు, వైద్యశాఖాధికారులు, విద్యార్థులు పాల్గోన్నారు.