05-09-2025 12:37:56 AM
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : ఎప్పుడు ఎలాంటి ఆపద సంభ వించిన అందుబాటులో అగ్నిమాపక కేం ద్రం ఉంటే రక్షణ కవచం లా పనిచేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ, క్రీడలు, యువజన సేవలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
గురువారం జడ్చర్ల మున్సిపాలిటీలోని జౌకి నగర్లో నిర్మితమైన సెట్విన్ శిక్షణా కేంద్రం రూ 47 లక్షల వ్యయంతో హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్ సౌజన్యంతో సి.ఎస్.ఆర్ నిధులతోనిర్మించిన అగ్నిమాపక కేంద్రం నూతన భవనాలను రాష్ట్ర పశుసంవర్ధక, డై రీ, క్రీడలు, యువజన సేవలు, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యు లు జనంపల్లి అనిరుద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక విభాగానికి తగిన సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ ప్రథ మ కర్తవ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు ఆధునిక పరికరాలు, సిబ్బంది ఈ కేం ద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది.
జడ్చర్ల పరిసర ప్రాంతాలకు ఈ కేంద్రం భద్రతా పరంగా మేలైన తోడ్పాటు అందిస్తుంది అని మంత్రివర్యులు తెలిపారు. మండల స్థాయి లో కూడా అగ్నిమాపక కేంద్రాలు విస్తరించేందుకు తగిన ప్రతిపాదనలు రూపొందిం చాలని ఆయన సూచించారు. ముదిరాజుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.75 ఏళ్ల చరిత్రలో ముదిరాజ్ సామాజిక వర్గాని కి, మత్స్యశాఖకు నాకు మొదటి మంత్రిగా అ వకాశం రావడం గర్వకారణం.
నా మొదటి కేబినెట్ సమావేశంలోనే చాపల కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశానని,సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రూ 122 కోట్లు కేటాయించారన్నారు. ఈ ని ధులలో రూ 10 కోట్లు రొయ్యల పెంపకానికి, రూ 84 కోట్లు చాపల కోసం కేటా యించడం జరిగిందన్నారు. ఇవన్నీ పూర్తిగా పారదర్శకంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ముదిరాజ్ సోదరుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగ ర్ శాసన సభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కోనేటి పుష్పలత, వైస్ చైర్ పర్సన్ బాలాది సరిత, ఆర్.డి. ఓ.నవీన్, జిల్లా అగ్నిమాపక అధికారి కిషోర్, హెటిరో ల్యాబ్స్ ప్రతినిధులు సుధాకర్,రవికిరణ్, ఫణి, మున్సిపల్ కౌన్సిలర్ చైతన్య చౌహాన్, మున్సిపల్ కమిషనర్ లక్ష్మా రెడ్డి, తహశీల్దార్ నర్సింగ రావు, తదితరులు పాల్గొన్నారు.