05-09-2025 12:36:26 AM
సన్మానం, ప్రసంగ సమయంలో ఎవరూ లేకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించిన మంత్రి.
నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) ఉత్తమ ఉపాధ్యాయ సన్మాన కార్య క్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుం ది. కార్యక్రమానికి మొదట భారీగా హాజరైన ఉపాధ్యాయులు భోజనానంతరం సన్మానం ప్రారంభానికి ముందే అక్కడి నుండి వెళ్లిపోవడంతో సన్మానం, ప్రసంగాల సమయంలో అన్ని కాలి గుర్తులే దర్శనమిచ్చాయి. దీంతో రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కా ర్యక్రమాన్ని బహిష్కరించారు.
ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మంతటి చౌరస్తాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చోటుచేసుకుంది. గురువారం రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఖర్చు అంతా తానే భరిస్తూ భోజన ఏర్పాట్లు చేశారు. తరగతి గదిలోని విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను ఎలా అందించాలన్న అంశాల్లో సాంస్కృతిక కళాకారుల చేత ప్రత్యేక కార్యక్రమాన్ని సైతం ఏర్పాటు చేశారు.
విలువలు విజ్ఞతతో కూడిన ఉపాధ్యాయులు ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాద్దని కార్యక్రమానికి ముందే బోధన ఏర్పాటు చేశారు. కానీ భోజనం చేసిన వెంటనే ఉపాధ్యాయులంతా వెళ్లిపోవడంతో ఒక్కసారిగా మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా 3,500మందికి పైగా ఉపాధ్యాయులు ఉండగా కనీసం 300 కు మించి హాజరు కాలేదు. అందులోనూ భోజనం అనంతరం మంత్రి ఉన్నానన్న గౌరవం, బా ధ్యత కూడా లేకుండా సుమారు 200 మందికి పైగా వెళ్ళిపోయారు.
దీంతో ఉపాధ్యాయులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశా రు. కార్యక్రమాన్ని వెంటనే బహిష్కరించాలని ప్రసంగం చేయకుండానే అలిగి వెనుతిరి గారు. దీంతో ఒక్కసారిగా కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వెంటనే తేరుకున్న ఉపాధ్యాయ సంఘాల లీడర్లు మంత్రిని బ్రతిమిలాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వినకుండా మరో డేట్ ఫిక్స్ చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
ఉపాధ్యాయులు అంటే గౌరవ మర్యాదలు విజ్ఞత, బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఈ ఘటనపై ఒక్కసారిగా తీవ్ర చర్చకు దారి తీసింది. కనీసం పాఠశాలకు కూడా సక్రమంగా హాజరు కాకుండా ఉత్తమ ఉపాధ్యా యుల సన్మాన దినం రోజు కూడా ఓపిక లేకపోవడం ఏంటని సర్వత్రా ఉపాధ్యాయులపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నెలవారి జీతాలు తీసుకోవడం తప్ప పని చేయడం పూర్తిగా మానేశారంటూ మండి పడుతున్నారు.
ఈ కార్యక్రమంలో 56 మందికి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, డీఈవో రమేష్ కుమార్ తదితర ఉపాధ్యాయ సంఘాల లీడర్లుఉన్నారు.