03-07-2025 02:20:40 AM
అర్మూర్, జూలై 2 (విజయ క్రాంతి) : ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వైద్యులను, చాటెడ్ అకౌంటెంట్లను బుధవారం రోటరీ క్లబ్ భవన్ లో డాక్టర్స్ డే, చాటెడ్ అకౌంట్ డే సందర్భంగా వైద్యులను, సి.ఏ.లను పూలమాల, శాలువలతో ఘనంగా సన్మానించారు. ఆర్మూర్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలను అందిస్తున్న వైద్యులు ముత్యం రెడ్డి, శ్వేత, సాహిత్ పటేల్, అమర్, వెంకటరమణ, స్నేహలను ఘనంగా సన్మానించారు.
సి.ఏ. దినోత్సవం సందర్బంగా ఇరవత్రీ రాజశేఖర్ సైతం సన్మానించారు. ఆర్మూర్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు రాధాకిషన్, కార్యదర్శి ఖాందేశ్ సత్యం, కోశాధికారి కోట నరేష్ కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు మొత్కూరి లింగ గౌడ్, రజనిష్ కిరాడ్, దాసరి సునీల్, పుష్పకర్, గంగమోహన్ చక్రు, వంగ వివేకానంద, గొనె దామోదర్, రాస ఆనంద్, వన్నెల్ దేవి రాము, తులసి పట్వరి, మారుతీ తదితరులు పాల్గొన్నారు.