calender_icon.png 5 July, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫస్ట్ ఎయిడ్ పుస్తకం ఆవిష్కరణ

03-07-2025 02:24:24 AM

శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ వారి ప్రత్యేక ప్రోగ్రాం

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 2 (విజయక్రాంతి): డాక్టర్స్ డే సందర్భంగా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్‌లో ప్రజలకు అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక చికిత్స అం దించడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని అం దించడంలో భాగంగా ఫస్ట్ ఎయిడ్ హ్యాండ్‌బుక్‌ను బుధవారం ఆవిష్కరించారు. నిజాం పేట యూనిట్, ప్రేమ బ్లాక్, 3వ ఫ్లోర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర వైద్య సేవలలో ప్రావీణ్యం కలిగిన డాక్టర్ జి.వి. రమణరావు ముఖ్యఅతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు.

అత్యవసర పరిస్థితు ల్లో సమయానికి ఇచ్చే ప్రాథమిక వైద్య సేవల ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఈ పుస్తకం శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ అత్యవసర విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ సూర్య తేజ రుద్రరాజు, డాక్టర్ నవీన్ నిమ్మల నేతృత్వంలో తయారు చేయబడింది.

అనుభవ జ్ఞులైన ఈఆర్ డాక్టర్ల బృందం రాసిన ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి సరళంగా, సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించబడింది. కార్యక్రమంలో శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ విఎస్ రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని, అత్యవసర విభాగం బృందం చేసిన ప్రయత్నాలను అభినందించారు.