calender_icon.png 22 May, 2025 | 9:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి అంటే వ్యక్తిగత ప్రయోజనాలేనా..?

22-05-2025 12:06:21 AM

కాంగ్రెస్‌లో అత్యధిక సార్లు టికెట్లు పొందడం గర్వంగా ఉంది

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, మే 21 (విజయక్రాంతి): అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అభివృద్ధి అంటే వ్యక్తిగత ప్రయోజనమేనా లేక ప్రజా ప్రయోజనమా అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యల పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పందించారు.

బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఎప్పుడూ కూ డా సహనం కోల్పోయి మాట్లాడలేదని స్పష్టం చేశారు. 1985లో రాజీవ్ గాంధీ నాయకత్వంలో పార్టీలో చేరిన తాను ఇప్పటికి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ప్రజా జీవితంలో ఉండడం వల్లే పార్టీ నాకు 14 సార్లు పోటీ చేసే అవకాశం కల్పించిందని, ఇది కాంగ్రెస్ పార్టీతో తనకున్న అనుబంధం అని, పార్టీలో ఎవరికి దక్కని అవకాశంగా.. అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినా గెలిచినా ప్రజా జీవితంలో ఏ మేరకు విజయవంతంగా పనిచేశామన్నదే ప్రజలు గమనిస్తారన్నారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకుంటున్న సంజయ్ కుమార్ ఆయన చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలన్నారు. మా టిమాటికి డబుల్ బెడ్ రూమ్ అంశాన్ని చూపిస్తూ అభివృద్ధి చేశానంటున్నాడని, ఉమ్మడి రా ష్ట్రంలో బలహీన వర్గాల కోసం భూసేకరణ చేసి నూకపెల్లి వద్ద 4వేల ఇందిరమ్మ ఇండ్లకు రూపకల్పన చేసింది తానేనన్నారు.

పదేళ్లు అధికారాన్ని వెలగబెట్టిన సంజయ్ కుమార్ ఆ ఇండ్లను పూర్తి చేయకుండా తాత్సారం చేసి అదే ఇండ్లను డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ కింద మార్చాడని అ యినా ఆ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలేక పోయాడన్నారు. ప్రస్తుతం డబుల్ బెడ్ రూమ్ ఇం డ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. 2014 లో ఉత్తర తెలంగాణ నుండి ఒక్కడినే కాంగ్రెస్ ఎమ్మెల్యే గా గెలుపుందానని ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉండి బిఆర్‌ఎస్ ప్రజా వ్యతిరేక పాలనను అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో ఎండగట్టానన్నారు.

బిఆర్‌ఎస్ సర్కార్ లో డొమాస్టిక్ ఏసిడి పన్ను పై జగిత్యాల లో నాలుగు గంటలు ధర్నా చేస్తే.. రద్దు చేశారని,చిప్ లిక్కర్ పై కూడా పోరాటం చేశానని గుర్తు చేశారు.పదేళ్ళు పార్టీ పిలుపు మేరకు ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం చేశానని,ఏనాడు కూడా వెనుకడుగు వేయలేదని, దాని ఫలితమే కాంగ్రెస్ పార్టీ నేడు అధికారం లోకి వచ్చిందన్నారు. తన తాతలు కాంగ్రెస్ పార్టీ  అని, తాను కూడా కాంగ్రెస్ పార్టీవాడినని చెప్పుకుంటున్న సంజయ్ కుమార్ కు జీవన్ రెడ్డి కౌం టర్ ఇచ్చారు.

అన్ని పార్టీలు సంజయ్ కుమార్ వే నని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సం జయ్ కుమార్ దని  ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల మాదిరిగా జగిత్యాల ని యోజకవర్గంలో సాధారణంగా జరిగిన అభివృద్ధి తప్పా ప్రత్యేకంగా నిధులు తెచ్చి సంజయ్ కు మార్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని నిలదీశారు.

చట్టంలో ఉన్న చిన్న లొసుగు ను ఆసరా గా చేసుకొని జగిత్యాల మున్సిపాలిటీని, ఎంపీపీని అగ్రవర్ణాలకు కట్టబెట్టి బీసీల కు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక జీవో తెచ్చి మున్సిపాలిటీ చైర్మన్, ఎం పీపీ ని బలహీన వర్గాల అభ్యర్థులకు అప్పగించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, గాజంగి నందయ్య, దుర్గయ్య,కొత్త మోహన్, గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.