22-05-2025 12:04:25 AM
ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
కరీంనగర్, మే21(విజయక్రాంతి): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి కార్యాలయంతోపాటు నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
మొదట నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌక్ వద్ద నిర్వహించిన రా జీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డా .కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై, సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 15లక్షల రూపాయల సుడా న్నిధులతో త్వరలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మున్సిపల్ కమిషనర్ చాహత్ బాచ్ పేయ్ హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించినా రు.
అనంతరం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పి సిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ గారు మాజీ హౌస్ పెయిడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కాంగ్రెస్ నాయకులు నగేష్ ముదిరాజ్ రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం గొప్ప విషయమని, కానీ కాలానుగుణంగా దెబ్బతిన్న ఆ విగ్రహ స్థానంలో కొత్తగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి త్వరలోనే జిల్లా మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు , పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారి సూచన మేరకు పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహా ఆవిష్కరణ కార్య క్రమం తో పాటు నెహ్రు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిఅన్నారు.
కార్యక్రమాలలో నాయకులు కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గడ్డం విలాస్ రెడ్డి పులి ఆంజనేయులు గౌడ్ శ్రావణ్ నాయక్ వెన్న రాజమల్లయ్య నిహాల్ అహ్మద్ ఎండి అజీమ్ కామరెడ్డి రామ్ రెడ్డి కలువల రాంచందర్ వంగల విద్యాసాగర్ నాగుల సతీష్ అహమ్మద్ అలీ కుర్ర పోచయ్య ఆకుల నరసయ్య మామిడి సత్యనారాయణ రెడ్డి మహమ్మద్ చాంద్ ఆనంద్ కుమార్ కుంబాల రాజకుమార్ జీడి రమేష్ ములకల కవిత యోనా వెన్నం రజిత రెడ్డి జ్యోతి రెడ్డి వాసాల రవీందర్ హస్త పురం తిరుమల ముస్తాక్ జొన్నల రమేష్ ఎలగందుల మల్లేశం మేతరి శ్రీనివాస్ బత్తిని చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.