భారత్‌కు డోలా అప్పగింత
తుర్కియే నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 28: తుర్కియే ఇస్తాంబుల్‌లో అరెస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం అనుచరుడు సలీమ్ డోలాను భారత్‌కు అప్పగించడంతో అతడిని మంగళవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చారు. తుర్కియే పోలీసులు, భారత ఇంటలిజెన్స్ సంయుక్తంగా ఇస్తాంబుల్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం విచారణ నిమిత్తం ఇంటెలిజెన్స్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా డోలాను ముం బై, లేదా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు అప్పగించనున్నట్లు సమాచారం.
ఇతన్ని అదుపులోకి తీసుకోవడంతో అంతర్జాతీయ డ్రగ్ మాఫియాకు ఎదురుదెబ్బ తగిలింది. దావూద్‌కు చెందిన డీ విదేశాల్లో నిర్వహించే డ్రగ్ ఆపరేషన్లకు డోలానే ప్రధాన సూత్రధారి. ఇతడి కనుసన్నల్లో ఏడాదికి రూ. 5వేల కోట్ల డ్రగ్స్ వ్యాపారం సాగుతోందనే అంచనాలున్నాయి. కొన్ని నెలల క్రితం డోలా నెట్‌వర్క్‌కు చెందిన సలీమ్ సోహైల్ షేక్ అనే డాలర్ దుబాయ్‌లో అరెస్టయ్యాడు. అతడిని భారత్‌కు అప్పగించిన తరువాత ఈ డ్రగ్ నెట్‌వర్క్ తీగ లాగితే డొంక కదిలింది.
సలీమ్ డోలా కుమారుడు తాహెర్ కూడా గతేడాది పట్టుబడ్డాడు. అతన్ని కూడా భారత్‌కు తీసుకు వచ్చి విచారించారు. ఈ క్రమంలో డోలా ఆచూకీ లభించినట్లు తెలుస్తుంది. 2024లో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 4 కిలోల డ్రగ్స్ పట్టుకున్నారు. దీని విలువ రూ. 10 కోట్లు విచారణలో భాగంగా మహారాష్ట్ర, సాంగ్లీ, గుజరాత్‌లోని సూరత్ నుంచి దుబా య్ మీదుగా టర్కీ వరకు ఉన్న నెట్‌వర్క్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ నెట్‌వర్క్‌ను సలీండోలా తెరవెనుక ఉండి నడిపిస్తున్నట్లు గుర్తించారు. అప్పటి నుంచి పోలీసులు, దర్యాప్తు బృందాలు గుట్టుచప్పుడు గాకుం డా దర్యాప్తు చేపట్టి చివరికి దావూద్ డ్రగ్స్ నెట్‌వర్క్ ముఖ్యుడు సలీం డోలాను అరెస్టు చేశారు.






