14-03-2025 01:19:14 AM
పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ఆదిలాబాద్, మార్చ్ 13 (విజయ క్రాంతి) : కేసుల నమోదులో చాప్యం చేయకుండా సక్రమంగా కేసుల నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లాలోని బోథ్, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ లను ఎస్పీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
బోథ్ పోలీస్ స్టేషన్ లో మొక్క నాటి పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న వాహనాలపై వాటి స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క ఫిర్యాదును ఆన్లైన్లో, ఆఫ్లైన్లో నమోదు చేయాలని సూచించారు.
రౌడీ షీటర్ లను, సస్పెక్ట్ షీట్లను ఓపెన్ చేసి వారిని నిరంతరం తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సరిహద్దులోని ఘన్పూర్ చెక్ పోస్ట్ ని పరిశీలించి, వాహనాల రాకపోకలు గమనించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి జీవన్ రెడ్డి, బోథ్ సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, బోథ్, బజార్హత్నూర్ ఎస్త్స్ర ప్రవీణ్, అప్పారావు, పిఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.