24-10-2025 02:45:02 PM
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంలో( Kurnool bus accident) 20 మంది మరణించడంపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Telangana Governor Jishnu Dev Varma) విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్లపై భద్రతా చర్యలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని జిష్ణుదేవ్ వర్మ సూచించారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివార్లలో హైదరాబాద్-బెంగళూరుకు వెళ్తున్న బస్సు పల్సర్ వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. పూర్తిగా దగ్ధమైన బస్సులోనుంచి 19 మృతదేహాలను వెలికితీశారు. ప్రమాదం జరిగినప్పుడు వి కావేరీ ట్రావెల్స్ బస్సులో దాదాపు 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా మంటలు చెలరేగడంతో చాలా మంది లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది.