calender_icon.png 24 October, 2025 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

24-10-2025 01:52:22 PM

నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం.

చిట్యాల,(విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం(Nakrekal MLA Vemula Veeresham) అన్నారు. శుక్రవారం నార్కెట్‌పల్లి మండలంలోని చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కోనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోని గిట్టుబాటు ధరను పొందాలని, దళారుల చేతుల్లో రైతులు మోసపోవద్దని అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ నర్రా వినోద - మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఐతరాజు యాదయ్య, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.