calender_icon.png 24 October, 2025 | 5:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాదం.. వెలుగులోకి రవాణాశాఖ లొసుగులు

24-10-2025 02:14:21 PM

హైదరాబాద్: కర్నూలు బస్సుప్రమాదం(Kurnool bus accident) ఘటనలో రవాణా శాఖ లోసుగులు వెలుగులోకి వచ్చాయి. ఆల్ ఇండియా పర్మిట్(All India Permit) పేరిట ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రమాదానికి గురైన వీ కావేరి ట్రావెల్స్ బస్సు డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ అయింది. డయ్యూ డామన్ లో వీ కావేరి ట్రావెల్స్ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుంది. కావేరి ట్రావెల్స్(Vemuri Kaveri Travels) ఒడిశా రాయగడ్ లో అల్ట్రేషన్, ఫిట్‌నెస్ చేయించుకుంది. రాయ్ గఢ్ అధికారులు అల్ట్రేషన్ లో సీటింగ్ పర్మిషన్ జారీ చేశారు. కావేరి ట్రావెల్స్ 43 సీట్ల సీటింగ్ పర్మిషన్ తీసుకుని బస్సును స్లీపర్ గా మార్చింది. ప్రమాదానికి గురైన బస్సు 2018లో తెలంగాణలో రిజిస్ట్రేషన్ జరిగింది. 2023లో ఎన్ఓసీతో డయ్యూ డామన్ లో రిజిస్ట్రేషన్ మార్చారు. రిజిస్ట్రేషన్ మార్చిన కావేరి ట్రావెల్స్ స్లీపర్ కోచ్ గా అక్రమానికి తెరదీసిందని విచారణలో బయటపడింది.

వీ కావేరి ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు

ప్రమాదానికి గురైన వీ కావేరి ట్రావెల్స్ బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ. 23,120 ఫైన్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. 27 జనవరి 2024 నుంచి 9 అక్టోబర్ 2025 వరకు 16 సార్లు బస్సు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించింది. 9 సార్లు నో ఎంట్రీ జోన్ లోకి  ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోనూ బస్సుపై జరిమానాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.