12-05-2025 02:32:33 AM
ఎల్బీనగర్, మే 11 : బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని హరిహర పురం కాలనీలో మథర్స్ డే సందర్భంగా ఆదివారం చేవూరి శంకర్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ రక్తదాన శిబిరం నిర్వహించా రు.
తల సేమియాలో రోగుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రంగారెడ్డి జిల్లా స హకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు ప్రారంభించారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.