12-05-2025 02:31:05 AM
ఇబ్రహీంపట్నం, మే 11 :మండల పరిధిలో పోల్కంపల్లి గ్రామంలో 2007-08 పూ ర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. పోల్కంపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు 17 సంవత్సరాల తరువాత కలుసుకున్న విద్యార్థిని, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఘనం గా సత్కారించారు. భారత్-పాక్ యుద్ధంలో మరణించిన వీర జవానులకు, అప్పటి ప్రిన్సిపల్ వసంత రెడ్డి, తోటి విద్యార్థులకు ని వాళులు అర్పించారు.
అనంతరం జ్ఞాపకాలను విద్యార్థులతో ఉపాధ్యాయులు పంచు కున్నారు. ఒకరికి ఒకరు యోగక్షేమాలను ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరము అండ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు వారు చదువుకున్న రోజు ల్లో జరిగిన మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకొని సాయంత్రం వరకు సంతోషంగా గడి పారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్, రాజు, విద్యార్థిని విద్యార్థులు భార్గవ్, బాల్రాజ్, లింగం, భగత్, పద్మలీల భాగ్య, భార్గవి, అందాలు,నాగరాజు, తదితరులు పాల్గొన్నారు..