calender_icon.png 28 October, 2025 | 6:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

28-10-2025 12:38:59 AM

పీఏసీఎస్ చైర్మన్ సాయిలు

చేగుంట, అక్టోబర్ 27 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోనే రైతులు విక్రయించాలని ఇబ్రహీంపూర్ పిఏసిఎస్ సొసైటీ చైర్మన్ సా యిలు తెలిపారు. సోమవారం చందాయిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేందుకే గ్రామాల్లో ధా న్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఈఓ సంతోష్ కుమార్, శ్రీనివాస్, మధు, సాయిబాబా, రమేష్, సాయి, మహేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.