15-11-2025 10:14:08 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): హైదరాబాద్ నివాసితులు, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ దంపతులు నల్మాస్ ఆనందమ్, నల్మాస్ భాగ్య లక్ష్మిలు నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్‌పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌కు సుమారు రూ.11000.00 విలువైన అవసరమైన వస్తువులను విరాళంగా ఇచ్చారు. అలాగే ఆయన మనుమరాలు రోషిని నాగర్ కాంతి రెండు నెలల క్రితం విద్యార్థులకు క్రీడా దుస్తులను కూడా విరాళంగా ఇచ్చారనీ మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ తెలిపారు. క్రీడా దుస్తులను ప్రదానం చేసిన సమయంలో పాఠశాలకు రూ.10,000 విరాళంగా ప్రకటించారు.
ఎలక్ట్రిక్ బెల్, తరగతి గది స్పీకర్ సెట్, ప్రధాన రహదారిపై రెండు పాఠశాల బోర్డులు, డయాస్ కోసం రెండు ఫ్లడ్ లైట్లు, కాలింగ్ బెల్ అందించబడ్డాయనీ మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్, డాక్టర్ నల్మాస్ ఆనందమ్, శ్రీమతి భాగ్యలక్ష్మి స్పాన్సర్ చేసిన వస్తువులు నాగిరెడ్డిపేట్ మోడల్ స్కూల్ పాఠశాలకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయనీ, తెలంగాణ మోడల్ స్కూల్, గోపాల్‌పేట ఉపాధ్యాయులు, విద్యార్థుల తరపున వారికి నల్మాస్ ఆనందమ్, శ్రీమతి భాగ్య లక్ష్మికి విరాళం ఇచ్చినందుకు నాగిరెడ్డిపేట్ మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్ కృతజ్ఞలు తెలిపారు.