15-11-2025 10:21:57 PM
స్వీకరించిన ధాన్యాన్ని ట్యాగ్ చేసి రైస్ మిల్లులకు సమయానికి రవాణా చేయాలి..
ట్యాబ్ ఎంట్రీలు కొనుగోలు కేంద్రాల వద్ద సక్రమంగా నమోదు చేయాలి..
రైతులకు ఆటంకం కలగకుండా కొనుగోలు కేంద్రాల వద్ద పి పి సి సెంటర్ నిర్వాహకులు చూసుకోవాలి..
అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చి అరబెట్టి నష్టపోతున్న రైతులను కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న సెంటర్ నిర్వాహకులు సీరియల్ ప్రకారం తరితగతిన ధాన్యం విక్రయం చేసి సమయానికి రైస్ మిల్లులకు సరఫరా చేయాలని సంబంధిత శాఖ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని గండి మాసంపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రంలో జిల్లా సంబంధిత శాఖ అధికారులతో ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలతో ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వర్షాకాలంలో భారీ వర్షాలకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లారని ఉన్న కాస్త ధాన్యాన్ని త్వరితగతిన విక్రయించి రైస్ మిల్లర్లకు సమయానికి తరలించాలని అధికారులకు సూచించారు.
అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న నిర్వాహకులు రైతుల నుండి ధాన్యం విక్రయం అనంతరం ట్యాబ్ లలో ఎంట్రీలు చేసి రైతులకు సమయానికి డబ్బులు పడే విధంగా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొనుగోలు కేంద్రం పర్యవేక్షణలో భాగంగా ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు ఏగుల నర్సింలు జిల్లా కలెక్టర్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డివిజన్ ఆర్డిఓ పార్థసింహారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ సంబంధిత శాఖ అధికారులు డిసిఎస్ఓ డి సి ఓ, బి ఎం సి ఎస్, మండల తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మండల వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఎల్లారెడ్డి ప్రాథమిక సహకార సంఘం కార్యదర్శి లారీల ద్వారా ధాన్యం రవాణా చేసే గుత్తేదారులు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
సుల్తాన్ నగర్ లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పర్యవేక్షణ..
అనంతరం ఎల్లారెడ్డి నుండి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, నిజాంసాగర్ మండలంలోని సుల్తాన్ నగర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనుల పురోగతి తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్. ఎల్లారెడ్డి మండలం సుల్తాన్ నగర్ పర్యటనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణా పనులను కలెక్టర్ పరిశీలించారు. అందులో భాగంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చెయ్యాలని ఆదేశించారు సకాలం లో బిల్లులు వస్తున్నాయా లేదా ఇంటి నిర్మాణం ఖర్చులు ఇసుక లభ్యత ఇతరత్ర విషయాలు కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంఆర్ఓ ఎంపిఓ పంచాయతీ కార్యదర్శులు హౌసింగ్ ఇంజనీర్లు, తదితరులు పాల్గొన్నారు.