15-11-2025 11:00:39 PM
చిన్న శంకరంపేట/చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటనలో భాగంగా చిన్న శంకరంపేట మండలంలోని అమరవీరుల స్థూపానికి పూలతో నివాళులు అర్పించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. మలిదశ ఉద్యమంలో మొదటగా నిర్మించిన తొలి అమరవీరుల స్థూపం అని తెలిపారు. జాగృతి కమిటీలను అన్ని మండలాల్లో ఏర్పాటు చేసి జాగృతి తరుపున ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు.