calender_icon.png 16 November, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై ధర్మ యుద్ధం చేస్తున్నాం

15-11-2025 10:48:09 PM

జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో స్థానిక ఎన్నికలకు వెళితే కాంగ్రెస్ ను బీసీలు ఎప్పటికి నమ్మరు 

బీసీ ధర్మ పోరాట దీక్షలతో కేంద్రం దిగి రావాలి

సీఎం ఢిల్లీకి అఖిలపక్షoతో వెల్లి ప్రధానిపై ఒత్తిడి పెంచాలి

డిసెంబర్ మొదటి ఒకటి నుండి జరిగే పార్లమెంట్ వేదికగా కేంద్రంపై రాష్ట్రం పోరాడాలి

పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలి 

బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీతో కొట్లాడుతారో, బీసీలకు దోషులుగా నిలబడతారో కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చుకోవాలి

బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు 

బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తo

బిజెపి బీసీ వ్యతిరేక వైఖరి విడనాడకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలే వచ్చే ఎన్నికల్లో పునరా వృత్తం అవుతాయి

బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

కాకతీయ యూనివర్సిటీ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కావాలని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు, ప్రధాని సమయం ఇవ్వకపోతే ఇండియా కూటమి తరపున పార్లమెంటు సమావేశాలను స్తంభింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేడు కాకతీయ యూనివర్సిటీలోని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా జరుగుతున్న బీసీల ధర్మ పోరాట దీక్షల ముగింపుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నబీసీ దీక్షలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పై చర్చకు పెట్టీ రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల చట్టానికి ఆమోదం తెలపాలని, లేదంటే డిసెంబర్ మొదటి వారంలో వేలాదిమందితో పార్లమెంటును దిగ్బంధం చేస్తామని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భంగా కష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 17న జరిగే క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వంలో ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పడాని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిసెంబరు ఒకటవ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలనీ పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యచరణ ప్రకటించాలనీ ఆయన డిమాండ్ చేశారు. 

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికి ఢిల్లీ వేదికగా పోరాడాలని రాష్ట్రానికి అయన సూచించారు, కేంద్రంపై పోరాడకుండా స్థానిక ఎన్నికలు వెళ్తే బీసీలకు కాంగ్రెస్  దోషిగా మిగులుతుందన్నారు,బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై బీసీల తిరుగుబాటు తప్పదన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే బీసీలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తారనీ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల వలె బీసీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దండెత్తరని హెచ్చరించారు. ఢిల్లీతో కాంగ్రెస్ పోరాడితే దేశంలోని బీసీల అండ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని, బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకుంటున్న బిజెపిని బీసీల దోషిగా చేసే బాధ్యత బీసీ సమాజం తీసుకుంటుందన్నారు. 

బీసీ ప్రధానిగా నరేంద్ర మోడీ గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికీ బీసీల డిమాండ్లను ఏ ఒక్కటి నెరవేర్చకపోవడం చాలా దురదృష్టకరమన్నారు, బిజెపికి బీసీల పై చిత్తశుద్ధి ఉంటే డిసెంబరు లో జరిగే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. బిజెపి గత ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు కూడా బిసిని చేయలేదని బీసీ కులగలను బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నందునే నిన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీలు బిజెపికి డిపాజిట్ రాకుండా చేశారని, బీసీ వైఖరితో బిజెపి ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలే పునరావృత్తం అవుతాయని ఆయన హెచ్చరించారు. 

బీసీ రిజర్వేషన్లపై బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ జేఏసీ ఇప్పటికే గత సెప్టెంబర్ 18న రాష్ట్ర బంద్ నిర్వహించామని, నవంబర్ 6 పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన దీక్షలు చేపట్టామని, మొన్న 13న తెలంగాణలోని 33 జిల్లాలు 119 నియోజకవర్గాలు అన్ని మండల కేంద్రాల్లో వేలాదిమంది రోడ్ల మీదకు వచ్చి ధర్మదీక్షలో చేశామని, రేపు రన్ ఫర్ సోషలిసిస్ పేరుతో ర్యాలీలు తీస్తామని, డిసెంబర్లో గల్లి నుండి ఢిల్లీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్తంభింప చేస్తామని ఆయన తెలిపారు. బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం పల్లె నుండి పట్నం దాకా బీసీలు పోరాడుతారని 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదనీ, గల్లీలో తెలంగాణ ఉద్యమ తరహలో, ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలు బీసీ ఉద్యమించి విజయం సాధించాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కేయూ బీసీల ధర్మ పోరాట దీక్ష ముగింపు సందర్భంగా బీసీ విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ నాగరాజ్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ దీక్షలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ, బీసీ జేఏసీ నాయకులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, డా. సంగాని మల్లేశ్వర్, డా. చిర్ర రాజు గౌడ్, బోనగాని యాదగిరి గౌడ్, వరంగల్ శ్రీనివాస్, భీమగాని యాదగిరి, మాదం పద్మజ దేవి, తమ్మేలా శోభరాణి, వేముల మహేందర్, డ్యాగాల శ్రీనివాస్, అజయ్ సింగ్,అన్వేష్ , రాజశేఖర్,కాగితపు నాగరాజు,అనిల్, సుమన్ రాజ్, నితిన్,వినోద్ తదితరులు పాల్గొన్నారు.