15-11-2025 10:10:34 PM
ఎల్లారెడ్డి రైతులకు అండగా ఎమ్మెల్యే మదన్ మోహన్..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గం రైతులు వరి కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ స్వయంగా జిల్లా కోఆపరేటివ్ అధికారి(DCO)తో మాట్లాడారు. వరి తూకం సమయంలో 2 కిలోల తరుగును అదనంగా తీసుకోవడం రైతులకు నష్టం జరుగుతుందని రైతులు ఎమ్మెల్యే చెప్పినట్లు అన్నారు. తక్కువ తరుగు తీసేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల వరదల కారణంగా ధాన్యంలో వచ్చిన, రంగు మార్పులపై రైతుల పట్ల సానుభూతి చూపుతూ, అలాంటి వరి ధాన్యాన్ని తిరస్కరించకుండా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా లారీలు, వాహనాలు తగినన్ని అందుబాటులో ఉంచి వరి త్వరగా రవాణా అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ, రైతులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ప్రతి సమస్యలో నేనే మీతో ఉంటాను. మీకు అన్యాయం జరగనివ్వను అని రైతులకు భరోసా ఇచ్చారు.