15-11-2025 10:52:23 PM
నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని రైతుల డిమాండ్.
రైతులను మోసం చేస్తున్న మిల్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి.
నేరేడుచర్ల (విజయక్రాంతి): నేరేడుచర్ల మండల పరిధిలోని చిల్లపల్లి గ్రామంలో గల అవని ఫుడ్స్ రైస్ మిల్లులో వే బ్రిడ్జి కాంటా తూకంలో క్వింటా ధాన్యం తేడా వచ్చిందని రైతు పేరం రాజు ఆరోపించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం అవని ఫుడ్స్ రైస్ మిల్లులో గత వారం పది రోజులుగా రైతులు దాన్యం విక్రయిస్తున్నారని, రైతులంతా ట్రాక్టర్ లోడ్ కు క్వింటా చొప్పున నష్టపోయారని, నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేయాలని రైస్ మిల్ ముందు రైతులు ధర్నా దిగారు. ఒకే ధాన్యంలోడుకు అవని ఫుడ్స్ రైస్ మిల్లులో 7300 కిలోలు తూకం వస్తే వేరొక రైస్ మిల్లులో 7400 కిలోలు తూకం వచ్చిందని రైతు పేరంరాజు తెలిపారు.
అంటే మిల్లు వే బ్రిడ్జి కాంటాక్ట్ ద్వారా 100 కిలోలు నష్టపోతున్నామని రైతులు గ్రహించి సదరు మిల్లు యజమాని లింగారెడ్డిని ప్రశ్నించగా వెంటనే కంప్యూటర్ సిస్టంలో గుట్టుచప్పుడు కాకుండా సరి చేశారని రైతుల ఆరోపిస్తున్నారు రైతులు సదరు వే బ్రిడ్జి రూమ్ యొక్క సిసి ఫుటేజ్ను బయటపెట్టాలని మోసపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ఒకవైపు వర్షాలతో పంటకుదేలై అంతకుముందేమో చీడా పీడలతో విసిగి వేసారిన రైతందానికి ఇప్పుడు ధాన్యం కొనుగోలు పెద్ద సవాలుగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోగా తూకం తగ్గించి మోసం చేయడం రైతుల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తుంది అన్నారు.
మిల్లుల దోపిడీకి అధికారులు కూడా బాధ్యులే : రైతులు
విల్లుల దోపిడీకి ఒకరకంగా అధికారులు కూడా బాధ్యులేనని రైతులన్నారు మిల్లులలో మోసాలు జరుగుతుంటే అధికారులకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకో పోకపోవడం వలన విచ్చలవిడిగా తమ ఇష్టారాజ్యంగా మిల్లు యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయని దీనిపై జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ధర్నాలు రైతులు కోనుగంటి శ్రీనివాస్ రెడ్డి పేరం రాజు, కొండా ముసలయ్య నన్నేపంగా కొండలు కొండా వెంకన్న భీమారపు సందీప్ కొండ సత్యనారాయణ కటారి వెంకటేశ్వర్లు చిమట గంగయ్య వీరం లక్ష్మీనారాయణ కొండా లింగయ్య కే పొట్టయ్య కే వెంకటయ్య తదిత రైతులు పాల్గొన్నారు.