calender_icon.png 3 November, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరసింహస్వామి ఆలయానికి దాతలు సాయం

03-11-2025 01:52:10 AM

కామారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో పలువురు భక్తులు ఆలయ అభివృద్ధి కోసం పలువురు  విరాళాలను అందజేశారు. కామారెడ్డి పట్టణానికి చెందిన చాట్ల జనార్ధన్ కుమార్తె చాట్ల దీక్షిత తన మొదటి సాలరీ రూ. 14,116 లను విరాళంగా అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి తెలిపారు. ధర్మవరం శ్రీనివాస్ రూ. 5,51,000 లు, సిరిసిల్లకు చెందిన బాస నరసయ్య 5,51, 000 ఆలయ ప్రధాన పూజారి వేల్పూరి పరంధామచార్యులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ప్రభు రామచంద్రం ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.