calender_icon.png 17 July, 2025 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి

17-07-2025 12:39:34 AM

దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్

దేవరకొండ, జూలై 16: దేవరకొండ పట్టణంలోని సాయి శివ గార్డెన్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని,మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను  దేవరకొండ శాసన సభ్యులు  నేనావత్ బాలు నాయక్ బుధవారం పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ మహిళల సాధికారత, పేదలకు న్యాయం కోసం మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారనీ, ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా ఆడబిడ్డల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రగతి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా మహిళా సమాఖ్య సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తుందని, వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరోసారి ప్రవేశపెట్టిందని, మహిళల చేతిలో డబ్బులు ఉండాలని మహిళలను కోటీశ్వరులను చేసే లక్ష్యంతో ఇందిరమ్మ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వారు తెలిపారు.

దేవరకొండ నియోజకవర్గంలో 4237 మహిళా సంఘాలకు 03 కోట్ల 89 లక్షల రూపాయల వడ్డి లేని రుణాల క్రింద  పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళా సంఘాలకు స్త్రీ నిధి కింద 3577మందికి గాను 56 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,మహిళా సంఘాలనాయకురాలు,మహిళా సంఘాల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.