17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ప్రార్థనలు వ్యక్తిగతం.. వివాదంతో ముడిపెట్టొద్దు

26-03-2025 11:59 PM

 మమ్ముట్టి కోలుకోవాలనే శబరిమలలో పూజలు

 స్నేహితుడి కోసం పూజలు చేస్తే తప్పేంటి?

 స్పందించిన నటుడు మోహన్‌లాల్

తిరువనంతపురం: ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తన స్నేహితుడు మమ్ముట్టి కోసం శబరిమలలో పూజలు చేయడంపై వివాదం నెలకొంది. ముస్లిం అయిన మమ్ముట్టి పేరుతో ఆలయంలో పూజలు ఎలా చేస్తారని మోహన్‌లాల్‌పై విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ వివాదంపై మోహన్‌లాల్ స్పందించారు. ప్రార్థనలు వ్యక్తిగతమని.. దీనిని వివాదంతో ముడిపెట్టి చూడొద్దని హితవు పలికారు. స్నేహితుడైన మమ్ముట్టి అనారోగ్యం బారిన పడ్డారని తెలిసి.. శబరిమలలో ప్రత్యేక పూజలు చేయించానని వివరించారు. దీనిపై వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. అయినా స్నేహితుడు కోలుకోవాలని పూజలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఇది తన వ్యక్తిగత విషయమని.. ప్రస్తుతం మమ్ముట్టి  కోలుకున్నారని తెలిపారు.

దేవస్థానానికి చెందినవారే పూజకు సంబంధించిన వివరాలు బయటికి చెప్పి ఉండొచ్చని మోహన్‌లాల్ ఆరోపించారు. అయితే మోహన్‌లాల్ వ్యాఖ్యలపై ట్రావెన్‌కోర్ బోర్డు స్పందించింది. ‘మోహన్‌లాల్ అపార్థం చేసుకున్నట్టున్నారు. అందుకే ఆలయ బోర్డును తప్పుబట్టారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాం’ అని పేర్కొంది. తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ నెల 18న మోహన్‌లాల్ శబరిమలను సందర్శించారు. ఆ సమయంలో మమ్ముట్టి పేరు మీద ఉషా పూజ జరిపించారు. పూజ సమయంలో మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి అని పేర్కొన్నారు.