calender_icon.png 13 November, 2025 | 3:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్సాహం వద్దు

21-11-2024 12:00:00 AM

గుకేశ్‌కు అర్జున్ సలహా

న్యూఢిల్లీ: చెస్ వరల్డ్  చాంపియన్‌షిప్‌లో డింగ్ లిరెన్‌తో తలపడనున్న భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్‌కు తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగైసి సలహా ఇచ్చాడు. టోర్నీలో అత్యుత్సాహం పనికి రాదని.. జాగ్రత్తగా ఆడితే విజయం సొంతమవుతుందని పేర్కొన్నాడు. అర్జున్ మాట్లాడుతూ..‘నేను గుకేశ్ స్థానంలో ఉండుంటే నన్ను నేను అతిగా ఊహించుకోను.

ఎప్పుడు మనల్ని మనం ఫేవరేట్‌గా భావించొద్దు. కేవలం నా ఆట మీద మాత్రమే దృష్టి పెడతా. గుకేశ్ కూడా అదే చేస్తాడని నమ్ముతున్నా’ అని అన్నాడు. నవంబర్ 25 నుంచి సింగపూర్ వేదికగా చెస్ వరల్డ్ చాంపియన్‌షిప్ జరగనుంది.