21-11-2024 12:00:00 AM
చైనా మాస్టర్స్ సూపర్ 750
షెంజెన్ (చైనా): చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్లు సింధు, లక్ష్యసేన్, మాళవిక రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ప్రపంచ 19వ ర్యాంకర్ సింధు 21-17, 21-19 తేడాతో బుసానన్ (థాయలాండ్) ను ఓడించింది. రెండో రౌండ్‌లో ఈ హైదరాబాదీ షట్లర్ సింగపూర్‌కు చెందిన జియా మిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
మరో యంగ్ ప్లేయర్ మాళవిక బన్సోద్ 20-22, 23-21, 21-16 తేడాతో హోజ్‌మార్క్ (డెన్మార్క్) మీద విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్‌లో భారత టాప్ సీడ్ లక్ష్యసేన్ 21-14, 13-21, 21-13 తేడాతో లీ జీ జియా (మలేషియా) మీద విజయం సాధించాడు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ జంట 12 21-19, 21-18 తేడాతో చెన్ జి రే- లిన్ యు (చైనీస్ తైపీ) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.