calender_icon.png 1 May, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుప్పెడు నువ్వులతో!

27-04-2025 12:00:00 AM

నువ్వుల్లో పీచు పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు నువ్వులు చాలా మంచిది. నువ్వులు క్రమం తప్పకుండా తింటే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. వీటిలో ఉండే ‘ఒలియిక్ యాసిడ్’, ‘లినోలిక్ యాసిడ్’ వంటివి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

నువ్వులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నువ్వులలో ఉండే అధిక క్యాల్షియం దీనికి తోడ్పడుతుంది. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులతో పోరాడేందుకు నువ్వులను తీసుకోవాలి. 

నువ్వులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా చాలా మేలు చేస్తాయి. నువ్వులలోని పీచు అరుగుదలకు తోడ్పడుతుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి నువ్వులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. 

నువ్వులు మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. నువ్వులలో ఉండే అనేక పోషకాలు దీనికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా నువ్వుల్లో ఉండే విటమిన్ బి6 మెదడుకు మేలు చేస్తుంది. నువ్వులు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చర్మ వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. నువ్వులలోని విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.