calender_icon.png 10 October, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కపాస్ కిసాన్’ యాప్ మాకొద్దు

10-10-2025 12:25:00 AM

బోథ్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రైతు లు పండించిన పత్తి పంటలు అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కపాస్ కిసాన్ యాప్‌ను జిల్లాలో పలువురు రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ యాప్‌పై ఇప్పటి రైతుల్లో గందరగోళం నెలకొనగా తా జా,  జిల్లాలోని సొనాల మండలం చింతల్ బోరి గ్రామ రైతులు సీసీఐ ద్వారా ప్రవేశపెట్టి న కపాస్ కిసాన్ యాప్‌ను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ మేరకు గురువారం వ్యవసాయ శాఖ అధికారికి రైతులు వినతిపత్రం అందించారు. ఈ యాప్ రైతుల పాలిట శాపంగా మారిందని రైతులు విమర్శించారు. ఈ యాప్ వినియోగంలో   నిరక్షరాస్యులైన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఈ యాప్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.  ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ కపా స్ కిసాన్ యాప్‌ను  బ్యాన్ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.