10-10-2025 12:23:27 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ తోనే సుపరిపాలన జరుగుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నా రు. గురువారం తన నివాసంలో నియోజకవర్గ స్థాయి నాయకుడు చునార్కర్ వెంకటేష్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కోవ లక్ష్మి తన నివాసంలో ఆయనకు గులాబి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకురాలు మర్సకోల సరస్వతి, కిష్టయ్య, ఆదె బాపూరావు, సాయికుమార్, లక్ష్మణ్ పాల్గొన్నారు.