16-08-2025 12:00:00 AM
టీఎన్జీవోస్ యూనియన్ నేతలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర పోరాట వీరులను మరువొద్దు అని టీఎన్జీవోస్ యూనియన్ నేతలు అన్నారు. టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిఎన్జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కుమార్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుసేని (ముజీబ్) , అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కురాడి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు కె ఆర్ రాజ్ కుమార్, రాష్ట్ర స్పోర్ట్స్ సెక్రటరీ బొలిగిద్ద శంకర్, క్లాస్ ఫోర్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు దాస్య నాయక్, కార్యదర్శి ఖాదర్ హసన్, క్లాస్ ఫోర్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ,
జిల్లా ప్రతినిధులు వైదీక్షాస్త్ర ముఖిమ్, జిల్లా ఏపీఆర్‌ఓ మమ్మద్ వాయిద్, ఇ ఎన్‌టి ఆస్పత్రి అధ్యక్షుడు తూముకుంట రాజు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, ఈఎస్‌ఐ అసోసియేట్ అధ్యక్షుడు రాజ్ కుమార్, వాటర్ వర్క్స్ అంజయ్యగౌడ్, ఎమ్మెస్ సాజిద్, మిత్రులు ఉస్మాన అల్లి, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.