15-08-2025 11:17:48 PM
మిడ్ మానేరు జలాశయంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మత్స్యకారులు తమ వృత్తిని ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించుకున్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, చీర్లవంచ గ్రామ మత్స్యకారులు శ్రీ రాజరాజేశ్వరీ మిడ్ మానేరు జలాశయం మధ్యలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. వీరి దేశభక్తికి పలువురు అభినందనలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం మాకు జీవనాధారమైన ఈ జలాశయంలో జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకుంటున్నామని మత్స్యకారులు తెలిపారు.