15-08-2025 11:13:57 PM
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి కె. సత్యనారాయణ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి భారత పౌరులు స్వేచ్ఛ వాయువులు పీల్చిన గొప్ప రోజని, ఎందరో మహనీయుల త్యాగ పలం,వారి ఆదర్శాలను సాధించాలని కోరారు. నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చేందుకు అధికారులుగా మా బాధ్యతను నెరవేరుస్తామన్నారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి రెయిన్ కోర్ట్స్ పంపిణీ చేశారు. కార్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.