calender_icon.png 14 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవసరం అయితే తప్ప బయటకు రావద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

13-08-2025 07:24:13 PM

ఎస్సై రవీందర్..

నకిరేకల్ (విజయక్రాంతి): తెలంగాణ వాతావరణ శాఖ తెలియజేసిన సూచన మేరకు నాలుగు రోజులపాటు భారీ వర్ష ప్రభావం ఉన్నందున . ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కట్టంగూరు ఎస్సై యం.రవీందర్(SI Ravinder) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలని, వాహన ప్రమాదాలు జరగకుండా వాహనదారులు నిదానంగా డ్రైవింగ్ చేయాలని ఆయన కోరారు. నీటి నిల్వ ఉండే ప్రాంతాలకు వెళ్ళొద్దని, విద్యార్థులను చెరువుల వద్దకు కాల్వల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. భారీ వర్షాలు ఉన్నప్పుడు బయటకు రావద్దని వర్షం సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద చెట్ల కింద నిలుచోవద్దని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే పోలీస్ వారికి సమాచారాన్ని అందించాలని ఆయన కోరారు. ఎప్పుడైనా అందుబాటులో ఉంటామని ఆయన తెలియజేశారు.