calender_icon.png 1 December, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెప్పపాటైనా పవర్ కట్ ఉండొద్దు

12-02-2025 02:13:48 AM

* విధుల్లో అప్రమత్తత తప్పనిసరి

* మార్చి 1 నాటికి కొత్త సబ్‌స్టేషన్లు

* డిప్యూటీ సీఎం మల్లు భట్టి

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): వేసవిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌శాఖ సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలో రెప్పపాటైనా పవర్ కట్ కాకుండా చూడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.

విద్యుత్ సరఫరా అంశం సున్నితమైన అంశమని, సరఫరాను నిత్యావసర వస్తువుగా పరిగణించాలని సూచించారు. క్షేత్రస్థాయి లో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దని హెచ్చరించారు. ఒకచోట సమస్య వస్తే కిందిస్థాయి సిబ్బంది వెంటనే పైస్థాయి అధికారులకు సమాచారం అందించాలని, వారు వారి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయాలని సూచిం చారు.

హైదరాబాద్ వంటి మహానగరంలో ఎమర్జెన్సీ వాహనాలు అందుబాటు లో ఉంచిన ట్లుగానే, ఆ సేవలను గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాలని పిలుపునిచ్చారు. మార్చి 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్‌శాఖలో బాగా పనిచేసే వారికి ప్రోత్సాహక అవార్డులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

సమస్యల పరిష్కారానికి ఏర్పాటుచేసిన టోల్‌ఫ్రీ నంబర్ 1912కు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నారు. సమావేశంలో ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ  కృష్ణభాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు.