యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దు
హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్..
హుజురాబాద్ (విజయక్రాంతి): మాదకద్రవ్యాలకు అలవాటు పడి జీవితం నాశనం చేసుకోవద్దని హుజురాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులి వెంకట గౌడ్(Circle Inspector Puli Venkat Goud) విద్యార్థులకు సూచించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై జీవితంతో పాటు కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి భవిష్యత్తుకు గట్టి పునాది వేసుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అజయ్, ఈసాముద్దీన్, రవి, శ్రీకాంత్, ఆదిల్, కృష్ణ కాంత్, మహేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.






