25 April, 2026 | 7:12 PM

ఆ అలవాట్లు నచ్చవు!

01-10-2024 12:00 AM

ఏదైనా బంధం ఎక్కువకాలం కొనసాగాలంటే పరస్పర అవగాహన చాలా ముఖ్యం. కానీ మగవాళ్ల అలవాట్లు మహిళలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. రిలేషన్‌లో తగాదాలకు దారితీసేలా చేస్తాయి. చిన్న చిన్న అలవాట్లు కూడా రిలేషన్‌పై ప్రభావం చూపుతాయి. మహిళలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేయాలని, భాగస్వామి అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. కానీ కొందరు తమ భాగస్వామి భావోద్వేగాలను పట్టించుకోరు.

కనీసం ప్రాధాన్యం కూడా ఇవ్వరు. ఈ అలవాటు బంధాన్ని దూరం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ భాగస్వామి భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంటే కాస్త సమయం ఇవ్వండి. అన్ని సమయాలలో ఆధిపత్యం చెలాయించడం కూడా మహిళలు ఇష్టపడరు. ఆరోగ్యకరమైన సంబంధంలో ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించాలి.

కొందరు మగవారు తమకు తెలియకుండానే కఠినంగా మాట్లాడుతుంటారు. ఇది మహిళలను బాధపెడుతుంది. తమ భాగస్వాములు సున్నితంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కూడా ముఖ్యం. చాలామంది కమ్యూనికేషన్‌లో వీక్‌గా ఉంటారు. అయితే తమ భాగస్వామి తమతో అన్ని విషయాలపై మాట్లాడాలని కోరుకుంటారు. 

కొందరు వ్యక్తిగత పరిశుభ్రతను విస్మరించినప్పుడు మహిళలు అస్సలు ఇష్టపడరు. ఈ అలవాటు సంబంధంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొడుతుంది. వ్యక్తిగత పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ అలవాట్లు మీలో ఉంటే కచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు ఫ్యామిలీ డాక్టర్లు.