calender_icon.png 22 July, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెదడును నిర్లక్ష్యం చేయవద్దు

22-07-2025 12:22:22 AM

కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాజిస్ట్ డాక్టర్ జయశ్రీ

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): మెదడును మనం ఎంత పదిలంగా చూసుకుంటే అది మనకు అంత సహకరిస్తుందని సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ న్యూరాజిస్ట్ డాక్టర్ ఎం జయశ్రీ చెప్పారు. మంగళవారం అంతర్జాతీయ మెదడు దినోత్సవం సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడారు. “ప్రపంచ వ్యాప్తంగా అన్ని వయసుల వారికి మెదడు ఆరోగ్యం అనే థీమ్‌తో  ముందుకు వెళ్తున్నారు.

కొన్ని న్యూరాలజీ జబ్బులకు పూర్తిగా నయం చేసే ట్రీట్మెంట్ అందుబాటులో లేదు. అందుకే ఇలాంటి జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించడానికి అవసరమైన అవగాహన కల్పించడం తప్పనిసరి. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే వారు. ఇప్పుడు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు స్ట్రోక్‌కు గురై చికిత్స కోసం వస్తున్నారు. యువత ఎక్కువగా స్ట్రోకు గురవడానికి ప్రధాన కారణం స్మోకింగ్, పొగతాడం, మద్యం సేవించడం.

జీవన విధానంలో మార్పులు, రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ ఎక్కువ, ఊబకాయం, గుండె జబ్బులు, ఈస్ట్రోజన్ కలిగి ఉన్న హార్మోన్ థెరపీలు, గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో స్ట్రోక్ వచ్చే అవకాశము ఎక్కువ. అన్యూరిజం వంటి రక్తనాళాల గోడలు బలహీనంగా ఉండటం వల్ల పక్షవాతం రావచ్చును. రక్తనాళములో అడ్డంకుల వల్ల వచ్చే స్ట్రోక్‌లో (ఇస్కీమిక్ స్ట్రోక్) థ్రాంబో లైటిక్ థెరపి, మెకానికల్ థ్రాంబెక్టమి వంటివి ఉంటాయి. ఇలాంటి ట్రీట్మెంట్ వల్ల తొందరగా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది.