calender_icon.png 22 July, 2025 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు టెట్ ఫలితాలు

22-07-2025 12:23:15 AM

ఉదయం 11 గంటలకు విడుదలచేయనున్న విద్యాశాఖ కార్యదర్శి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం విడుదలకానున్నాయి. విద్యాశా ఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను ఉదయం 11 గంటలకు విడు దల చేయనున్నారు. జూన్ 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 66 కేంద్రాల్లో 16 సెషన్లలో జరిగాయి.

టెట్ ప్రాథమిక కీని ఈనెల 5న విడుదల చేశారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి ‘కీ’పైన అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫలితాలను విడుదల చేస్తున్నారు. టెట్ పేపర్ 47,224 (74.65 శాతం) మంది, పేపర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ క్యాటగిరీలో 48,998 (73.48 శాతం) మంది, సోషల్ స్టడీస్‌లో 41,207 (76.73 శాతం) మంది హాజరయ్యారు. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.