22-07-2025 12:21:13 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): యూజీసీ (జూన్) 2025 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జూన్ 25 నుంచి 29 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తాజాగా ఫైనల్ కీ, ఫలితాలను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా 285 నగరాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 10,19,751మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 7,52,007 మంది పరీక్షకు హాజరయ్యారు.
వీరిలో జేఆర్‌ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 5,269 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్‌డీ అడ్మిషన్లకు 54,885 మంది, కేవలం పీహెచ్‌డీకి మాత్రమే 1,28,179 మంది చొప్పున మొత్తంగా 1.88 లక్షల మందికి పైగా అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. జేఆర్‌ఎఫ్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అర్హత కోసం ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంటారు.