calender_icon.png 10 January, 2026 | 11:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా రోగాలపై మీకు దయ రాదా?

10-01-2026 12:00:00 AM

  1. నిర్మల్ జిల్లాలో తల సేమియా వ్యాధి గ్రస్తులకు సదుపాయాలు  కరువు
  2. రక్త శుద్ధి కోసం ప్రతి నెల 2500 ఖర్చు
  3. నిర్మల్ జిల్లా కేంద్రంలో చికిత్స  వార్డు లేని దుస్థితి
  4. రక్తం దొరకక తల్లిదండ్రుల ఇబ్బందులు
  5. జిల్లాలో 200 మంది బాధితులు రక్తమార్పిడి కోసం ఇక్కట్లు

నిర్మల్, నవంబర్ 9 (విజయ క్రాంతి) : వంశ పారపర్యంగా వస్తున్న ఆ వ్యాధి ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. అసలే అనారోగ్యతో ప్రతిరోజు నరకం అనుభవిస్తున్న తలసేమియా, సిక్కిం సెల్ ఎమోఫి లియా అనే మూడు వ్యాధులు వారి జీవితాలకు శాపంగా మారాయి. ప్రభుత్వం వైద్యం గారికి కోట్లు ఖర్చు పెడుతున్న తల సేమి యా సిక్కింసెల్ ఎమోఫిలియా వ్యాధిగ్రస్తుల పట్ల కనీస చర్యలు తీసుకోకపోవడంతో వ్యాధి సోకిన వారు ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రతినెల పడరాని పాట్లు పడుతు న్నారు.

నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు మూడు మున్సిపాలిటీలు ఉండగా తల సేమియాతో 120 మంది సిక్కిం సెల్ తో 40 మంది ఎన్నో ఫీలియా తో మరో 40 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి వీరంతా వంశపారపర్యంగా సంక్రమించే వ్యాధుల్లో (రక్తహీనత కు సంబంధించిన వ్యాధులు) బాధపడుతున్నారు ఒక్కొక్క కుటుంబం లో తల్లిదం డ్రులతో పాటు పిల్లలు ఉండడంతో ఇంటి మొత్తం వైద్యం చేయించుకునేందుకు ప్రతినెల వారికి రక్తం అవసరం రక్తశుద్ధి యంత్రాలు అవసరం

వైద్యం కోసం ప్రతి నెల పరుగులు

జిల్లాలో రక్తహీనతతో కూడిన తల సేమి యా సిక్కిం సెల్ ఎమోఫిలియా వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త శుద్ధి చేయించుకుంటేనే వారు ప్రాణులతో ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రక్ష శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో హైదరాబాద్ మం చిర్యాల నిజాంబాద్ జిల్లా కేంద్రంలో రక్త శుద్ధి కేంద్రాలకు వెళ్లవలసి వస్తుంది నడవలేని స్థితిలో ఉన్నవారు ప్రత్యేక వాహనా లను అద్దెకు తీసుకొని వెళ్తున్నారు.

ప్రతి నెల మూడుసార్లు వ్యాధి తీవ్రతను బట్టి శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఆసుపత్రికి పోయి రావడానికి 2000 నుంచి 3000 ఖర్చు అవుతుందని కుటుంబాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారికి ప్రతినెల ప్రభుత్వం మందులను ఉచితంగా అందించాలి ఈ కోర్స్ మందులు బయట కొనుక్కోవాలంటే 2,300 వరకు ప్రతినెల ఖర్చు చేయ వలసి ఉంటుందని పాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలే అనారోగ్యం ఆపై మందుల ఖర్చు రవాణా ఖర్చు వచ్చిపోయేందుకు తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బం దులు తొలగించేందుకు నిర్మల్ జిల్లాలో రక్త శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మూడు సంవత్సరాలుగా జిల్లా అధికా రులను మం త్రులను కోరుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ ఏరియా హాస్పిటల్ లో జనరల్ వార్డులోని వీరికి చికిత్సలు అందిస్తున్నారు.

ప్రత్యేకంగా వాడు ఏర్పాటు చేసి ఒక వైద్యుని ఒక నర్సును ఇతర పారామెడికల్ సిబ్బందిని శాశ్వత ప్రతిపాదికన ఏర్పాటు చేయాలని కుటుంబాల సభ్యులు కోరుకుంటున్నారు ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువమంది 20 సంవత్సరాల లోపు పిల్లలు కావడం ఒక కుటుంబంలో ఇద్దరి నుంచి ముగ్గురు ఉండడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేసుకునే పరిస్థితి లేక అవస్థలు పడుతున్నారు ఏమా త్రం నిర్లక్ష్యం చేసిన తమ పిల్లల ప్రాణాలకు భద్రత ఉండడం లేదని వారు కన్నీటి పర్యవంతం అవుతున్నారు. వ్యాధి కారణంగా తమ పిల్లలను పాఠశాలకు పంపి పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

హక్కుల కోసం పోరాటం

నిర్మల్ జిల్లాలో భయంకరమైన తల సేమియా సిక్కింసెల్ హేమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు తమకు ప్రభుత్వపరంగా అందించవలసిన సౌకర్యాలపై గట్టిగానే పోరాడుతున్నారు నిర్మల్ లో బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న న్యూ మాన్ చైల్ హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నిర్వాకులు మన్సూర్ ఆధ్వర్యంలో వీరికి ప్రతినెల రక్తాన్నిధి కేంద్రా ల్లో రక్తం అందుబాటులో ఉంచడం వ్యాధి తీవ్రత గురైన వారికి వివిధ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేందుకు ఈ ట్రస్ట్ స్వ చ్ఛందంగా సేవలు అందిస్తుంది

వీరికి నిర్మల్ లో రక్తం శుద్ధి చేసే యంత్రాన్ని ఏర్పా టు చేయాలని జనరల్ వార్డులు కాకుండా ప్రత్యేకవాడు ఏర్పాటు చేసి వైద్యులు 24 గం టలు సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సలహాలు పెన్షన్స్ సౌక ర్యం కల్పించాలని పంటి డిమాండ్లను ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలి పారు అధికారులు మాత్రం బాధితులు వచ్చినపుడు తక్షణం చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్న ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్‌లో రక్త శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలి

నిర్మల్ జిల్లాలో తల సేమియా సికెన్సెల్ హోమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు 200 పైగా బ్రోగులు ఉన్నారు వీరికి ప్రతి నెల మూడుసార్లు రక్తం శుద్ధి చేయవలసి ఉంటుంది స్థానికంగా రక్తం శుద్ధి చేసే యంత్రాలు లేకపోవడంతో నిజాంబాద్ హైదరాబాద్ మంచిర్యాల వెళ్లి వారి పిల్లలను రక్తం శుద్ధి చేయించుకుని తిరిగి రావాల్సిన రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలి.

 మన్సూర్ అహ్మద్ ట్రస్ట్ నిర్వాహకులు

కష్టపడి ప్రాణాలు కాపాడుకుందాం

మా పాప వయసు 12 ఏళ్లు పుట్టినప్పటినుంచి తల సేమియా వ్యాధితో బాధప డుతుంది ప్రతినెల మూడుసార్లు రక్తం శుద్ధి చేస్తే కానీ పాప ఆరోగ్యం బాగుండదు నిర్మల్‌లో కేంద్రం లేకపోవడంతో మంచిర్యాల నిజాంబాద్ హైదరాబాద్ వెళ్లి రక్తం శుద్ధి చేయించుకుని వస్తున్నాం రానుపోను ఖర్చులు మందుల ఖర్చులు మేం భరించలేకపోతున్నాం ప్రభుత్వం వెంటనే నిర్మల్‌లో శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందించాలి.

- జ్యోతి కుంటాల

పెన్షన్ సౌకర్యం కల్పించాలి

ప్రభుత్వం వృద్ధులకు వితంతులకు క్షయ వ్యాధిగ్రస్తులకు బోదకాలు వారికి దివ్యాంగులకు ప్రతినెల పెన్షన్ అందిస్తుంది కానీ తల సేమియా సిక్యూసెల్ హోమోఫిలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇప్పటికీ పెన్షన్స్ సౌకర్యం కల్పించడం లేదు. కూలీ నాఆఈ చేసుకుని బతికే మాకు పిల్లల అనారోగ్యం మరింత ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తుంది ప్రభుత్వం సర్వే చేసి పెన్షన్ సౌకర్యం కల్పిస్తే కొంత ఊరట ఉంటుంది.

- లాస్య కొండకూరు