calender_icon.png 11 January, 2026 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ ఆత్మగౌరవంపై దాడి చేస్తే ఊరుకోం

10-01-2026 12:00:00 AM

సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సికింద్రాబాద్/సనత్‌నగర్, జనవరి 8 (విజయక్రాంతి):- ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ పేరును రూపు మాపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యే లు పద్మారా వు గౌడ్, ముఠా గోపాల్, మాజీ కార్పోరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, పలువురు కార్పొరేటర్ లు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు, పలు వ్యాపార, వాణిజ్య, కార్మిక సంఘాల ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 11న ఉదయం 11 గంటలకు బాలం రాయ్‌లోని లీ ప్యాలెస్‌లో సమావేశం నిర్వహిం చడం జరుగుతుందని తెలిపారు. 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సర్కిల్ ల మీదుగా ఎంజీ రోడ్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు 10 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ ను ముట్టడిస్తామని చెప్పారు.

అవసరమైతే బంద్ లు, ధర్నాలు నిర్వహిస్తామని చెప్పారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే సెక్రేటరీయేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మద్దతు తెలిపిన సంఘాల ప్రతినిధులకు ఆయన అభినందనలు తెలిపారు. పాట్ మార్కెట్ మార్వాడీ అసోసియే షన్, మోండా మార్కెట్ రిటైల్ వెజిటబుల్ అసోసియేషన్‌తదితర సంఘాలు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించారు.