calender_icon.png 11 October, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రాపురంలో ఇంటింటి మలేరియా సర్వే

11-10-2025 12:00:00 AM

వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 10 (విజయక్రాంతి) : మండల పరిధిలోని ఆలుబాక సబ్ సెంటర్ రామచంద్రాపురం గ్రామంలో శుక్రవారం వైద్యాధికారి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇంటింటి మలేరియా సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా జ్వరంతో ఉన్న వారిని గుర్తించి వారికి రక్తపుత సేకరణ, ఇంటిలో మురికి నీరు పారబోయటం, కాలువలో తిమోపాస్ మందు పోయటం జరిగింది. వైద్య శిబిరం నిర్వహించి మలేరియా నిర్ధారణ పరీక్షలు ఆర్డిటిని నిర్వహించారు.

వారికి నెగిటివ్గా నిర్ధారణ చేశారు. గర్భవతులు, బాలింతలను పరీక్షించి వారికి ఆరోగ్య సలహాలు సూచనలు, కొన్ని జాగ్రత్తలు తెలిపారు. క్షయ, మధుమేహం, రక్తపోటు వారికి నెలసరి మందులు తప్పనిసరిగా వాడాలని,వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని గ్రామస్తులకు వైద్యాధికారి తెలియపరిచారు.

ఈ శిబిరంలో 52 మంది గర్భవతులు 12 మంది బాలింతలు, 6గురు క్షయ వ్యాధిగ్రస్తులు, 10 మంది షుగర్, 16 మంది బీపీ పేషెంట్లను పరీక్షించడం జరిగింది. ముగ్గురికి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈకార్యక్రమంలో వైద్యాధికారి పవన్ కళ్యాణ్, హెచ్ ఇ ఓ కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ భూపతి, ఏఎన్‌ఎం ధనలక్ష్మి, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.