calender_icon.png 11 October, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏపీలో వాల్యూ గోల్డ్ విస్తరణ

11-10-2025 12:00:00 AM

ఏడు కొత్త బ్రాంచీల స్థాపన

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాం తి): దక్షిణ భారతదేశంలో అత్యంత విశ్వసనీ య బంగారం కొనుగోలు బ్రాండ్లలో ఒకటైన వాల్యూగోల్డ్.. ఆంధ్రప్రదేశ్‌లో తమ విస్తరణపై అధికారిక ప్రకటన చేసింది. విశాఖపట్ట ణం, విజయవాడ, కర్నూల్‌లో మొత్తంగా ఏడు బ్రాంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారుడికే మొదటిప్రాధ న్యత ఇస్తూ, నమ్మకమైన ఆర్థికలావాదేవీలు జరపాలనే వాల్యూగోల్డ్ దూర దృష్టితో ఈ కొత్త బ్రాంచీల ఏర్పాటు ఓ మైలురాయిగా నిలవనుంది.

1901 నుంచి భారతదేశంలో అత్యంత పేరుపొందిన బంగారం కొనుగోలు సంస్థ అయిన క్యాప్స్ గోల్డ్ విభాగమైన వాల్యూగోల్డ్.. పారదర్శకత, ఖచ్చితత్వం,  ఆటోమేటెడ్ ప్రక్రియతో బంగారం కొనుగోలుకు సరికొత్త ఒరవడి చుట్టింది. వాల్యూగోల్డ్ డైరెక్టర్ అభిషేక్‌చందా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో “వాల్యూగోల్డ్ యొక్క విశ్వసనీయ సేవలను ప్రారంభించడం మాకు సం తోషంగా ఉంది.

గత రెండు సంవత్సరాలలో మేము తెలంగాణలో 10,000 మందికిపైగా వినియోగదారు లకు సేవలు అందించాము. బంగారం కొనుగోలు వంటి ఆర్థిక నిర్ణయా ల్లో నమ్మకమైన, పారదర్శక అనుభవాన్ని వినియోగదారులకు అందించేందుకు మేం ఎల్లప్పుడూ కృషి చే స్తాం” అన్నారు.  నాలుగు బ్రాంచ్లుగా మొదలై గత ఆరు నెలల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 15 కొత్త బ్రాంచ్లను ప్రారంభించింది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19 బ్రాంచ్లను కలిగి ఉంది.  రాబోయే రెండు సం వత్సరాలలో 40 నుంచి  50 కొత్త బ్రాంచ్లను ప్రారంభించి దక్షిణ భారతదేశం అంతటా తన విశ్వసనీయ సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారిస్తోంది. వాల్యూగోల్డ్ డైరెక్టర్ అఖిల్‌చందా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్లోకి విస్త రించడం.. మా బంగారం విక్రయాన్ని మరింత అందుబాటులోకి తెచ్చి, విశ్వసనీయంగా చేయాలనే లక్ష్యాన్ని బలపరుస్తుంది” అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి,  వాల్యూగోల్డ్ అంబాసిడర్ అనసూయభరద్వాజ్ హాజరయ్యారు. నమ్మకం, సాధికారత, ప్రా మాణికతను సూచించే బ్రాండ్‌గా వాల్యూగోల్డ్‌ను సమర్థించారు. వాల్యూగోల్డ్ ఈఓ భర ద్వాజ్‌పంపట్వార్ డైరెక్టర్లు హాజరయ్యారు.