calender_icon.png 8 May, 2025 | 1:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిగ్రీ అడ్మిషన్లకు ‘దోస్త్’ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు

07-05-2025 12:00:00 AM

జగిత్యాల అర్బన్, మే 6 (విజయక్రాంతి): రాష్ర్టంలోని ఇంటర్మీడియ ట్, తత్సమాన పరీక్షలు పాసైన విద్యార్ధిని, విద్యార్థులందరూ డిగ్రీలో ప్రవేశాల కొరకై దోస్త్ (డిగ్రీఆన్లున్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లు ప్రారంభమ య్యాయి అని స్థానిక  ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా దోస్త్ అడ్మిషన్ల కోఆర్డినేటర్ డాక్టర్ అరిగెల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లాలోని విద్యార్థులందరూ ఈ దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను వినియోగించుకొవాలని, ఎలాంటి సాంకేతిక సమస్యలు గానీ, ఇతర సమస్యలు గానీ తలెత్తినట్టైతే ప్రిన్సిపాల్ 98484 15835, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సాయి మధుకర్ 8121513671, టెక్నికల్ అసిస్టెంట్ గణేష్ 99632 87177 లను సంప్రదించగలరని పేర్కొన్నారు.