calender_icon.png 12 May, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం

12-05-2025 06:46:10 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కేసులకు సంబంధించి నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకమని కామారెడ్డి సబ్ డివిజన్ (Kamareddy Sub-Division) ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఇందిరానగర్ డబుల్ బెడ్ రూం ఇళ్ల(Double Bedroom Homes) సముదాయంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ప్రజలంతా కలిసి రూ. 2 లక్షలు జమచేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు నేర పరిశోధనలతో పాటు నేరాలను అరికట్టడంలో, నేరస్థులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్ర శేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరామ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.