12-05-2025 06:42:02 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని, కార్మిక చట్టాలను కుదించి, కార్మికుల హక్కులను హరించే విధంగా ప్రయత్నిస్తోందని, ఇందుకు నిరసనగా ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఐసిడిఎస్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆశా వర్కర్స్, అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రతినిధులు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, భోజన కార్మికులు, కేంద్ర ప్రభుత్వ స్కీం వర్కర్స్ శ్రమ దోపిడికి గురవుతున్నారని, సమాన పనికి సమాన వేతనం, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు, వసతులు, లేబర్ కోడ్ రద్దు తదితర అంశాలపై సంకటిత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కీసర సౌమ్యశ్రీ, రమ, మహమూదా, ఉపేంద్ర, పద్మ, ఉమా, రేషపల్లి నవీన్, వెలుగు శ్రావణ్ పాల్గొన్నారు.