calender_icon.png 14 September, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు స్ఫూర్తి ప్రదాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

14-09-2025 08:29:11 PM

అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు,నత్తి మైసయ్య

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 343వ ఆదివారం జ్ఞానమాల సమర్పించారు.ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ తన మేధస్సును, తన జీవితాన్ని భారతీయుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దార పోసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  మొదటి రౌండు టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

దళిత, పీడిత, బడుగు, బలహీన, అంటరాని వర్గాలు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని, నాటి బ్రిటిష్ ప్రభుత్వం గుండె కరిగేలా సబికులు మంత్రముగ్ధులయ్యే విధంగా ఉపన్యసించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను బ్రిటిష్ పత్రికలు సైతం అభినందించాయి.అలాంటి మహోన్నత వ్యక్తి అపర మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత, విజ్ఞానాన్ని పెంపొందించుకొని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని, బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతమై తమ హక్కుల కోసం పోరాడుతూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని నత్తి మైసయ్య పిలుపునిచ్చారు.