calender_icon.png 15 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఆర్థిక సహాయం

14-09-2025 10:11:55 PM

మణుగూరు,(విజయక్రాంతి): స్థానిక మురళీ మాన్ పవర్ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్స్ గా విధులు నిర్వహిస్తు మేదర బస్తిలో నివాసముంటున్న దొనికే ప్రేమ్ కుమార్,  శ్రీనివాస్, ల  తండ్రి రాజమౌళి గత కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. కాగా కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆడుకునేందుకు  తోటి సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలిసి ముందుకు కదిలారు. రూ.32,600 రూపాయల ఆర్థిక సహాయాన్ని అన్నదమ్ము లకు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ. ప్రతి ఒక్క కుటుంబానికి, ఏ ఒక్కరికి ఆపద వచ్చిన మేమున్నాము అంటూ భరోసా కల్పిస్తూ ముందుండి వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తూ. ఒకే కుటుంబం లాగా కలిసి మెలిసి ఉంటామని తెలిపారు.