calender_icon.png 15 September, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ఆర్ బాయ్స్ జూనియర్ కళాశాలలో దారుణం

14-09-2025 09:55:41 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): తోటి విద్యార్థులు ఒక విద్యార్థిని ర్యాగింగ్ చేస్తూ దాడి చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగరకి చెందిన గంగాధరి గణేష్ (17) అనే విద్యార్థి ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు గణేష్ ని హాస్టల్ లో ముగ్గురు తోటి విద్యార్థులు మొదటినుంచి ర్యాగింగ్ చేస్తూ, కొట్టిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రమేష్ ని బోడుప్పల్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ హరీష్ రెడ్డికి తెలిపిన ఎలాంటి స్పందన రాకపోవడంతో, మేడిపల్లి పోలీస్ స్టేషన్ లొ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆదివారం  ఎస్ ఆర్ జూనియర్  కళాశాల ముందు బంధువులు  విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన కు దిగారు. మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి స్పందిస్తూ డబ్బుల విషయంలో జరిగిన గొడవ  అని, విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు.